YSRCP: ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • తుపాను బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన
  • శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
  • ఆత్మహత్యాయత్నం చేసినందుకు కేసు నమోదు
వైసీపీ నేత పిరియా సాయిరాజ్ పై శ్రీకాకుళం జిల్లా సోంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడం లేదని ఆరోపించిన ఆయన... ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ఆత్మహత్యకు యత్నించారు.

దీంతో, ఆయనపై 309, 341, 353 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు, సాయిరాజ్ పై కేసు నమోదు చేయడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడితే, కేసు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
YSRCP
piriya sairaj
case
sompet
srikakulam

More Telugu News