Pawan Kalyan: ఉద్దానంపై పై పవన్ కల్యాణ్ ది దొంగ ప్రేమ.. పవన్ ను కేటీఆర్ అభినందించడం ఏమిటి?: చంద్రబాబు

  • ఉద్దానం ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. పవన్ ఎక్కడున్నారు?
  • కేసీఆర్, జగన్, పవన్ లు నాపై కక్షగట్టారు
  • తెలుగు జాతిని బీజేపీ చిన్నచూపు చూసింది
ఉద్దానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది దొంగ ప్రేమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. తిత్లీ తుపానుతో ఉద్దానం ప్రజలు ఇబ్బంది పడుతుంటే పవన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తుపాను బాధితుల గురించి మాట్లాడకుండా... పవన్ కల్యాణ్ కవాతును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసించడమేమిటని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కల్యాణ్, జగన్ ముగ్గురూ తనపై కక్షగట్టారని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తారనే నమ్మకంతోనే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని... హామీలను అమలు చేయకపోగా, తెలుగు జాతిని చిన్నచూపు చూశారని మండిపడ్డారు. 
Pawan Kalyan
KCR
Jagan
Chandrababu

More Telugu News