గుండెలపై చిన్నారిని ఉంచిన డాక్టర్లు.. ఒక్కసారిగా కోమా నుంచి బయటపడ్డ తల్లి!
- బ్రెజిల్ లోని ఫోర్టాలెజాలో ఘటన
- మూర్ఛవ్యాధితో కోమాలోకి వెళ్లిపోయిన అమండ
- ప్రసవం అనంతరం పిల్లాడు తాకడంతో స్పృహలోకి
బ్రెజిల్ లోని ఫోర్టాలెజా ప్రాంతంలో అమండా డిసిల్వా(28) తన భర్తతో కలిసి ఉంటోంది. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న అమండా డెలివరీకి రెండు వారాల ముందు కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో 9 నెలలు పూర్తయ్యాక వైద్యులు సిజేరియన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీశారు.
తొలుత శిశువుకు వైద్యం అందించిన డాక్టర్లు తర్వాత ఆ బిడ్డను తల్లి అమండా గుండెలపై ఉంచారు. దీంతో కన్నబిడ్డ తాకిన కొద్దిసేపటికే అమండా మెలకువలోకి వచ్చింది. కాగా, ఈ సందర్భంగా అమండా మాట్లాడుతూ.. తనకు డెలివరీ ఎలా జరిగిందో తెలియదని చెప్పింది. నవజాత శిశువుకు విక్టర్ గా పేరు పెట్టినట్లు వెల్లడించింది.