గోవాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- ఢిల్లీలో గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
- మరో ఇద్దరు, ముగ్గురు కూడా చేరుతారని వెల్లడి
గోవా నుంచి ఢిల్లీ బయల్దేరే ముందు వీరిని రిపోర్టర్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ, బిజినెస్ పని మీదే తాను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. సుభాష్ మాట్లాడుతూ, బీజేపీలో చేరడానికి తాను ఢిల్లీకి వెళ్లడం లేదని... తాను బీజేపీలో చేరితే ఆ విషయం మీకు చెబుతానని తెలిపారు.