దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడి మృతి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను కనులారా దర్శించి అమ్మ దర్శనం చేసుకోవాలని భక్తి ప్రపత్తులతో వచ్చిన ఓ భక్తుడు దేవాలయంలోనే మరణించాడు. గత అర్ధరాత్రి గుండెపోటు రావడంతో అమ్మవారి సన్నిధిలోనే అతను ప్రాణం విడిచాడు. మృతుడిని కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు. ఆలయ అధికారులు వెంటనే స్పందించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.


More Telugu News