రైతన్నల కన్నెర్ర.. అనంతపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు తాళం వేసి నిరసన!
- విద్యుత్ కోతలపై ఆగ్రహం
- నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్
- రైతులతో పోలీసుల చర్చలు
జిల్లాలోని బెళుగుప్ప మండలం హనిమిరెడ్డి పల్లెలో విద్యుత్ శాఖ అధికారులు మాటిమాటికి సరఫరాను నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం విద్యుత్ సబ్ స్టేషన్ కు చేరుకుని అధికారులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్ కు తాళం వేసి ధర్నాకు దిగారు. నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసేవరకూ తాళం తీయబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు.