అంతమాటంటావా?.. వెళ్లి ఇమ్రాన్ ఖాన్ కేబినెట్‌లో చేరు!: సిద్ధూపై బీజేపీ మండిపాటు
- దక్షిణాదికి వెళ్లడం కంటే పాక్ వెళ్లడమే బెటరన్న సిద్ధూ
- సర్వత్ర విమర్శలు
- 'కమెడియన్' అన్న అన్నాడీఎంకే
సిద్ధూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సిద్ధూపై వేటు వేయాలన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి మురళీధరన్ శివలింగం సిద్ధూ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని, ఆయనో కమెడియన్ అని ఎద్దేవా చేశారు.