డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన భర్త.. హల్ చల్ చేసిన భార్య!
- హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఘటన
- అతిగా మద్యం తాగి భార్యతో వాహనంలో వచ్చిన వ్యక్తి
- కారును స్వాధీనం చేసేందుకు ససేమిరా
- లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించిన ట్రాఫిక్ పోలీసులు
"మా ఆయన మద్యం తాగి కారు నడిపితే మీరు కేసు నమోదు చేయండి.. అంతేకాని బండి సీజ్ చేస్తే నేను ఇంటికెలా వెళ్లాలి?" అంటూ గొడవకు దిగింది. ఆమెను అదుపు చేసేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. కారును సీజ్ చేసేందుకు అంగీకరించనని నిరసన తెలిపింది. అమె హంగామాను మీడియా చిత్రీకరిస్తుండగా, ఓ కెమెరాను లాక్కొని ధ్వంసం చేసింది. తన భర్త పేరును, తన పేరును చెప్పేందుకు కూడా ఆమె అంగీకరించలేదు. దీంతో పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీసులకు వారిని అప్పగించారు. డ్రంకెన్ డ్రైవ్ లో మొత్తం 101 మందిపై కేసులు నమోదు చేశామని, 61 టూ వీలర్లు, 39 కార్లు, ఒక ఆటో పట్టుబడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు.