వైజాగ్ లో దారుణం.. పోలీస్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై నరికి చంపిన గంజాయి స్మగ్లర్లు!

  • వేంపాడు టోల్ గేట్ వద్ద ఘటన
  • కారులో దూసుకొచ్చిన దుండగులు
  • కత్తులతో నరికి పరారీ
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ గేట్ వద్ద ఆగిఉన్న ఓ వ్యక్తిని కారులో వచ్చిన 8 మంది దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం అదే వాహనంలో ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన నీలమగ అమరన్ గా గుర్తించారు. మృతుడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గంజాయి వ్యాపారులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు.

అయితే గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నందున ఈ హత్య చేశారా? లేక ఈ దారుణం వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
Go Back to Shorts
Visakhapatnam District
nakkapalli
Andhra Pradesh
attaack
police
constable
killed
Tamilnadu
amaran
weed smugllers

More Telugu News