Uttam Kumar Reddy: డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడం ఖాయం: ఉత్తమ్ ధీమా

  • తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది
  • నిజామాబాద్ లోని 9 స్థానాలూ కాంగ్రెస్ కే  
  • కేసీఆర్ ను ఇంటికి పంపాలి
తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, డిసెంబర్ 12న తమ ప్రభుత్వం కొలువు దీరడం ఖాయమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ (డీఎస్), ఎమ్మెల్సీ భూపతిరెడ్డి అనుచరులు ముప్పై మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నిజామాబాద్ లోని తొమ్మిది నియోజకవర్గాలూ కాంగ్రెస్ కే దక్కేట్టు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపాలని, నాలుగేళ్ల పాలనలో ప్రచారం చేసుకోవడం తప్ప ఆయన ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు. 
Uttam Kumar Reddy
KCR
TRS
congress

More Telugu News