తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. ఇంటర్వ్యూల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
- 267 మంది అభ్యర్థులను తప్పించిన ధర్మాసనం
- వైట్ నర్ వాడటం, డబుల్ బబ్లింగే కారణం
- ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశం
2016, నవంబర్ లో 1,032 గ్రూప్-2 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్సీ రాతపరీక్షను నిర్వహించింది. దాదాపు 5.65 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే వైట్ నర్ వాడకం, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం... తాజాగా అలాంటి అభ్యర్థులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.