21వ తేదీకి వాయిదాపడిన ప్రణయ్ సంస్మరణ సభ
- ఈనెల 14న నిర్వహించాలని తొలుత నిర్ణయం
- అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కమిటీ ప్రకటన
- ప్రణయ్, అమృత మద్దతుదారులు తరలిరావాలని పిలుపు
ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యోదంతాన్ని ఖండిస్తూ ఈనెల 14వ తేదీన ప్రణయ్ మద్దతుదారులతో సంస్మరణ సభ నిర్వహించాలని అమృత-ప్రణయ్ న్యాయపోరాట సంఫీుభావ కమిటీ నిర్ణయించింది. ఈ సభ 21న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతుందని, ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత పీడిత, బహుజన, కుల పోరాట, కుల నిర్మూలన సంఘాల ప్రతినిధులతోపాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు హాజరవుతారని తెలిపారు.