sexual herasment: అమ్మతనానికి మాయని మచ్చ...కూతురిపైనే లైంగిక వేధింపులు!

గోరుముద్దలు తినిపించిన తల్లి మనసులోని వక్ర బుద్ధిని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. జోలపాడాల్సిన చేతులు వేరే ఉద్దేశంతో ఒంటిని స్పృశిస్తాయని  కలలో కూడా అనుకోలేదు. ఆలనాపాలనా చూసి ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన తల్లే వెకిలి చేష్టలతో వేధిస్తుంటే అసలు విషయం అర్థమయ్యేసరికి ఆశ్చర్యపోవడం ఆ బాలిక వంతయింది. తప్పని చెప్పాల్సిన బామ్మ కూడా అమ్మకు వత్తాసు పలుకుతుండడంతో భరించలేక తండ్రి సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, బామ్మను కటకటాల వెనక్కి పంపారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన తమిళనాడులో వెలుగు చూసింది.

పోలీసుల కథనం మేరకు...చెన్నైలోని తేనాంపేటలో తల్లి, బామ్మతో కలిసి ఓ పద్నాలుగేళ్ల బాలిక నివసిస్తోంది. తల్లితో మనస్పర్థలు రావడంతో తండ్రి విడిపోయి వేరే చోటుకు వెళ్లిపోయాడు. స్వలింగ సంపర్కురాలైన (లెస్బియన్) బాలిక తల్లి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టింది. తొలిరోజుల్లో కారణం అర్థం చేసుకోలేకపోయిన చిన్నారి క్రమక్రమంగా కన్నతల్లి పాడు ఆలోచనను పసిగట్టింది. తీవ్రంగా వ్యతిరేకించింది.

ఆదుకుంటుందని బామ్మకు చెబితే ఆమె తల్లికి సహకరించాలని చెప్పడంతో తట్టుకోలేకపోయింది. దీంతో వేరేచోట ఉంటున్న తండ్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లింది. అతను ఆగ్రహోదగ్రుడయ్యాడు. లైంగిక వేధింపులను తప్పుపడుతూ భార్య, అత్తలను హెచ్చరించాడు. పలుమార్లు ఇలా హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడంతో తన కూతురిపై భార్య, అత్త లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యంగా సెల్‌ ఫోన్‌ వీడియో ఆధారాన్ని వారికి అందజేశాడు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద బాలిక తల్లిని, ఆమె బామ్మను అరెస్టు చేశారు.
sexual herasment
daughter and mother
Tamil Nadu

More Telugu News