సిక్కోలు వాసులకు తీవ్ర ఆపద వచ్చింది.. ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలి!: సీఎం చంద్రబాబు
- పొరుగురాష్ట్రం కంటే మనమే సరిగ్గా అంచనా వేశాం
- బాగా పనిచేసిన అధికారులకు అవార్డులు అందజేస్తాం
- ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
తిత్లీ తుపాను ఓ పెను విపత్తు అని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. సిక్కోలు ప్రజలకు తీవ్ర ఆపద ఎదురయిందనీ, ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో బాగా, చురుగ్గా పనిచేసిన వారికి అవార్డులు అందజేస్తామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అగ్నిమాపక, విపత్తు, నేవీ శాఖలు సహాయ చర్యల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు పూడ్చి, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. మరికాసేపట్లో సీఎం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.