allu shirish: అల్లువారి అబ్బాయి తాజా చిత్రం విడుదల తేదీ ఖరారు

  • అల్లు శిరీష్ హీరోగా 'ఏబీసీడీ'
  • కథానాయికగా రుక్సర్ థిల్లాన్ 
  • ఫిబ్రవరి 8వ తేదీన విడుదల  
అల్లు శిరీష్ నిదానమే ప్రధానం అన్నట్టుగా చాలా తీరుబడిగా కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. 'ఒక్క క్షణం' సినిమా పరాజయంపాలు కావడంతో ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. సంజీవ్ అనే కొత్త దర్శకుడితో కలిసి ఆయన 'ఏబీసీడీ' అనే సినిమా చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ మలయాళంలో చేసిన సినిమాకి ఇది రీమేక్.

రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, హీరో స్నేహితుడిగా భరత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. 'మాస్టర్ భరత్' గా ఈ కుర్రాడు చాలా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో అల్లు శిరీష్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.   
allu shirish
ruksar

More Telugu News