మోదీ పేరెత్తలేదు, 15 లక్షలు వేస్తామనలేదు: మాటమార్చిన నితిన్ గడ్కరీ
- రాహుల్ గాంధీకి మరాఠీ ఎలా అర్థమైంది?
- ఆయన మరాఠీ ఎప్పుడు నేర్చుకున్నారు?
- తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న గడ్కరీ
తన మరాఠీ ఇంటర్వ్యూపై మరింత వివరణ ఇచ్చిన గడ్కరీ, ఏడెనిమిది రోజుల క్రితం తాను ఇంటర్వ్యూ కోసం వెళ్లానని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్, గోపీనాథ్ ముండే ఇచ్చిన ఎన్నికల హామీల గురించిన ప్రస్తావన వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అమలుకు సాధ్యం కాని ఎన్నికల హామీలు ఇవ్వవద్దని తాను అభ్యంతరం చెప్పానని, అటువంటి హామీల జోలికి వెళ్లవద్దని తాను వారిద్దరికీ సూచించిన విషయాన్ని గుర్తు చేశానని గడ్కరీ అన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.