Chandrababu: మనం అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది: సీఎం చంద్రబాబు

  • నేడు ప్రారంభించింది మహాయజ్ఞం
  • ఇది పూర్తి కావాలంటే టీడీపీ అధికారంలో ఉండాలి
  • కుందుర్పి కాల్వకు భూమిపూజ చేసిన చంద్రబాబు
మనం అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని గరుడాపురంలో చంద్రబాబు పర్యటించారు. గరుడాపురంలో సమీపంలోని కుందుర్పి కాల్వకు భూమిపూజ చేశారు.

అనంతరం, బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ, నేడు ప్రారంభించింది మహాయజ్ఞమని, ఈ యజ్ఞం పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని అన్నారు. కేంద్రప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని, వీళ్లు చేస్తున్న మోసాన్ని గ్రహించి ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని అన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన పనులు చేపడుతున్నామని, భవిష్యత్తులో ఐదు నదులను అనుసంధానించి మహాసంగమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. నదుల అనుసంధానం చేసి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు.
Chandrababu
Andhra Pradesh

More Telugu News