tamannah: 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో జయప్రదగా తమన్నా
- శ్రీదేవి పాత్రలో రకుల్
- త్వరలో తమన్నాపై చిత్రీకరణ
- జయసుధగా ఎవరనే దానిపై ఆసక్తి
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. క్రేజ్ వున్న ఒక్కో ఆర్టిస్ట్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్న కొద్దీ .. మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. శ్రీదేవి .. జయప్రద .. జయసుధలతో కలిసి ఎన్టీఆర్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. శ్రీదేవి పాత్రకి రకుల్ ను తీసుకోవడం .. ఆమెపై ఒక పాటను చిత్రీకరించడం జరిగిపోయింది.
జయప్రద పాత్ర కోసం రాశి ఖన్నాను సంప్రదించినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జయప్రద పాత్ర కోసం తమన్నాను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో జయప్రద పాత్ర ఐదు నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రను చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం 3 రోజుల పాటు డేట్లు కేటాయించిందని కూడా అంటున్నారు. ఇక జయసుధ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో చూడాలి.