నన్ను అభినందిస్తూ పీఎమ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది: కౌశల్
- 'బిగ్ బాస్ 2' విజేతగా కౌశల్
- విపరీతంగా పెరిగిపోయిన క్రేజ్
- డాక్టరేట్ కూడా ఇస్తున్నారు
తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను 'బిగ్ బాస్ హౌస్' నుంచి బయటికి వచ్చిన మూడో రోజున పీఎమ్ గారి ఆఫీస్ నుంచి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను షూటింగులో ఉండటం వలన, మా ఫాదర్ రిసీవ్ చేసుకుని మాట్లాడారు .. వాళ్లకి థ్యాంక్స్ చెప్పారు" అని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో 'డాక్టరేట్ గురించి వస్తోన్న వార్తల్లో నిజమెంత?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనేది నేను చెప్పడం కన్నా .. ఇచ్చేవాళ్ల ద్వారా మీకు తెలిస్తేనే బాగుంటుంది' అని కౌశల్ అన్నారు.