ఏపీలో అధికారపక్ష నేతల అవినీతి సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్ తో సమానం: జీవీఎల్

  • అవినీతి సొమ్మును కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు
  • ఐటీ దాడులు జరుగుతోంది వారి బినామీ కంపెనీల పైనే
  • ఏపీలో ఐటీ శాఖ తనిఖీలు ఇంకా జరగాలి
ఏపీలో అధికారపక్ష నేతలు సంపాదించిన అవినీతి సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్ తో సమానమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి సొమ్ము సంపాదించిన నేతలు ఆ సొమ్మును పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని, అవినీతిపరుల బినామీ కంపెనీల పైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

ఐటీ దాడులు జరిగిన కంపెనీల్లో అధికార  పార్టీ నేతలు ఆ కంపెనీల్లో బోర్డు సభ్యులుగా లేనప్పుడు భయమెందుకు? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఫైవ్ స్టార్ హోటళ్లను మించిన భవనాలను కట్టుకున్నారని, ఏపీలో ఐటీ శాఖ తనిఖీలు ఇంకా జరగాలని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. 
Go Back to Shorts
gvl
Andhra Pradesh
Telugudesam

More Telugu News