దసరా స్పెషల్: సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
- దసరా పండుగ వేళ సౌకర్యం
- అటు నుంచి రాత్రి, ఇటు నుంచి పగలు ప్రయాణం
సికింద్రాబాద్-నర్సాపూర్ ప్రత్యేక రైలు (నంబరు 07256) ఈ నెల 17వ తేదీ రాత్రి 7.20 గంటకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (నంబరు 07002) ఈ నెల 17వ తేదీ ఉదయం 5 గంటలకు కాకినాడ టౌన్లో బయలు దేరుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దసరా పండుగ ముందు రోజుల్లో రైల్వే శాఖ చేసిన ఈ ఏర్పాటు వల్ల ప్రయాణికులకు కొంత ఊరట అని చెప్పొచ్చు.