electuion commission: తెలంగాణ ఎన్నికలకు మోగిన నగారా.. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు: ఎన్నికల కమిషన్ ప్రకటన
- డిసెంబర్ 11న ఫలితాల ప్రకటన
- నవంబర్ లో నోటిఫికేషన్ జారీ
- వివరాలు వెల్లడించిన ఎన్నికల కమిషన్
దేశరాజధానిలో ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ.. తెలంగాణ లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం డిసెంబర్ 11న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 8న ప్రకటించాల్సి ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న ప్రకటిస్తామని తేల్చిచెప్పారు.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 12న నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు. నవంబర్ 19 వరకూ నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చని, 22 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణతో పాటు రాజస్తాన్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తాజా ప్రకటనతో పూర్తిస్థాయిలో తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లయింది.