ముంబైలో షాక్... డ్రగ్స్ మత్తులో ఫ్యాషన్ డిజైనర్ ను కొట్టి చంపిన కన్న కొడుకు!
- ముంబై పేజ్-3 వర్గాల్లో తీవ్ర కలకలం
- గతంలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన సునీత
- డ్రగ్స్ మత్తులో చంపిన కొడుకు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లక్ష్య సింగ్ ను విచారించగా, అతనే ఆమెను డ్రగ్స్ మత్తులో హత్య చేసినట్టు తెలిసింది. తల్లితో బాత్ రూములో గొడవ పడిన లక్ష్య సింగ్, ఆమెను గట్టిగా వెనక్కు నెట్టడంతో, తల వాష్ బేసిన్ కు బలంగా తగిలి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తొలుత ఆమె కాలుజారి పడిందని చెప్పిన లక్ష్య సింగ్ మాటలను విశ్వసించినా, ఆపై తమ విచారణలో అతనే హత్య చేశాడని తేలిందని, అతనిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు పెట్టామని పోలీసులు వెల్లడించారు. తల్లీ కొడుకుల మధ్య డబ్బు లేదా ఆస్తులకు సంబంధించిన వివాదం తలెత్తి ఉండవచ్చని తెలిపారు.