Vijayawada: వినాయక చవితి సందర్భంగా అసభ్య నృత్యాలు... ముగ్గురు యువతులు సహా 12 మందికి జరిమానా!

  • విజయవాడ, నున్న సమీపంలో డ్యాన్సులు
  • అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
  • రూ. 1,700 చొప్పున జరిమానా విధించిన న్యాయమూర్తి
గత నెలలో జరిగిన వినాయక నవరాత్రుల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల్లో అసభ్య నృత్యాలు చేసిన 12 మందిపై రూ. 1,700 చొప్పున జరిమానా విధిస్తూ, విజయవాడ 6వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.పద్మ తీర్పిచ్చారు. నున్న పోలీసు స్టేషన్ పరిధిలోని రంగాబొమ్మ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, సెప్టెంబర్ 13న పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఆవుల మానస, దాసరి జ్యోతి, షణ్ముఖ యామిని అనే యువతులతో పాటు మరో 9 మంది పురుషులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా, కేసును విచారించిన న్యాయమూర్తి జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.
Vijayawada
Recording Dance
Court
Fine
Nunna

More Telugu News