Chandrababu: చంద్రబాబుది ఐరన్ లెగ్.. పచ్చటి చెట్టూ భస్మమైపోతుంది: కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

  • దోస్తీ కలుద్దామని చంద్రబాబు చెప్పాడు
  • చంద్రబాబునాయుడూ.. నీతో పొత్తా.. ఛీ ఛీ!
  • మహాకూటమా? గూటమా?  
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘తెలుగు పేరు మీదనే కదా మా కొంప ముంచుకున్నది. ‘తెలుగు తల్లి, తెలుగు భాష’ అని అరవై ఏళ్లు మమ్మల్ని దోచుకున్నారు. దోస్తీ కలుద్దామని చంద్రబాబు చెప్పిండు.

చంద్రబాబునాయుడూ.. నీతో పొత్తా.. ఛీ ఛీ. బతికుండగా కలవం. నీ అడుగుపడితే పచ్చటి చెట్టు కూడా భస్మమైపోతుంది. అంత దరిద్రం.. ఐరన్ లెగ్ నీది. నీ దోస్తీ మాకెందుకు?.. మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలవకుంటే మహాకూటమి వచ్చిందంటాడు. మహాకూటమా? గూటమా?, నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల రంగంలో నీ దమ్మేందో, మా దమ్మేందో తేల్చుకుందాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ లేరు’ అని కేసీఆర్ అన్నారు.
Chandrababu
kcr
Wanaparthy District

More Telugu News