Rahul Gandhi: రాహుల్ గాంధీ అవసరం దేశానికి వుందనిపిస్తోంది: కమలహాసన్

  • తమిళ ప్రజల తరపున మాట్లాడేందుకే రాజకీయాల్లోకి
  • మా పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి
  • ప్రస్తుతం రాజకీయాల్లో నా పాత్రను ఎంజాయ్ చేస్తున్నా
మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశానికి రాహుల్ గాంధీ అవసరం ఉన్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నకు.. ఇద్దరి లక్ష్యాలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు ఒకటి కానప్పుడు వారు ఎప్పుడూ కలిసి పని చేయలేరని సమాధానమిచ్చారు.

గతంలో ఓ కామెంట్ చేసినందుకు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన ఆస్తులన్నింటినీ సీజ్ చేసినంత పని జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమిళ ప్రజల తరపున మాట్లాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తమ పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ఆ లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్నామని చెప్పిన కమల్, ప్రస్తుతం రాజకీయాల్లో తన పాత్రను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు.
Rahul Gandhi
Kamal Haasan

More Telugu News