Chandrababu: చంద్రబాబునాయుడిని నేను వేధిస్తున్నానట!: కేసీఆర్

  • చంద్రబాబు చక్కటి మనిషని వేధిస్తున్నారు
  • ఓటుకు నోటు నిజం కాదా?
  • నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా?
చంద్రబాబునాయుడిని తాను వేధిస్తున్నానట, ఎవడు వేధిస్తున్నాడు? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘నువ్వు (చంద్రబాబు) చక్కటి మనిషివని నిన్ను వేధిస్తున్నారు! ఓటుకు నోటు దొంగతనం నిజం కాదా? ఓ బుడ్డెరఖాన్ ని నువ్వు (చంద్రబాబు) పంపితివి..వాడు దొరికే! అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ (చంద్రబాబు)  పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా?.. ఇంకా, నిన్ను ఏం వేధిస్తున్నారు బిడ్డా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News

Chandrababu
kcr
Wanaparthy District