Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూటర్న్ ఎఫెక్ట్.. ఇక అలాంటి సినిమాలకు సమంత నో!

  • నష్టాలు తెచ్చిన 'యూటర్న్'
  • నిరాశ చెందిన సమంత
  • ఆ తరహా సినిమాలపై అనాసక్తి      
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సమంతకి మంచి క్రేజ్ వుంది. ఈ ఏడాది ఈ రెండు భాషల్లో ఆమె చేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి .. ఒక్క 'యూటర్న్' తప్ప. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మంచి అంచనాలతోనే థియేటర్లకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆదరణ పొందలేదు. ఫలితంగా నష్టాలు వచ్చాయి.

అందువలన ఇకపై నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు సమంత చేయకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలతో మంచి లాభాలను తెచ్చిపెట్టిన కథానాయికగా అనుష్క కనిపిస్తుంది. ఇక తమిళంలో నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను భారీ వసూళ్ల దిశగా పరిగెత్తించే నాయికగా నయనతార కనిపిస్తుంది. వాళ్ల బాటలో అడుగులు వేయడానికి ప్రయత్నించిన సమంతకి ఆదిలోనే నిరాశ ఎదురైంది. అందువలన ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆమె ఆసక్తి చూపకపోవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 
samanta

More Telugu News