కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్
- నల్గొండలో ఆందోళన చేపట్టిన టీడీపీ శ్రేణులు
- ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరిక
నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ, ‘ఇవాళ ఇక్కడ (తెలంగాణ) దుకాణం పెడదామనుకుంటున్నావు.. బిడ్డా! నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. తెలంగాణకు మళ్లీ నువ్వు కావాలా?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.