తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన అనుష్కా శర్మ!
- పోరాటాన్ని కొనసాగించాలని సూచన
- నిజాలు చెప్పేందుకు ధైర్యం కావాలని వ్యాఖ్య
- ఇప్పటికే పలువురు సెలబ్రిటీల మద్దతు
తనుశ్రీ తన పోరాటాన్ని ధైర్యంగా కొనసాగించాలని చెప్పింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి చాలా ధైర్యం కావాలని వ్యాఖ్యానించింది. ‘మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ విధులు నిర్వర్తించేటప్పుడు భయపడకూడదు. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారో, ఎదుటివారు ఎంత శక్తిమంతమైనవారో తెలిసినప్పుడు ముందుకొచ్చి నిజాలను వెల్లడించడానికి చాలా ధైర్యం కావాలి. అది లేకపోవడం వల్లే చాలామంది ఇంకా ముందుకు రావడం లేదు’ అని అనుష్కా శర్మ వ్యాఖ్యానించింది.