నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో!: చంద్రబాబుకు కేసీఆర్ వార్నింగ్
- ఏపీలో చంద్రబాబు కథ చక్కగా లేదు
- తెలంగాణకు మళ్లీ నువ్వు కావాలా?
- ఎన్నో పోరాటాలు చేసి పీడ వదిలించుకున్నాం
చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణను మళ్లీ తీసుకుపోయి విజయవాడకు అప్పజెబుతారా? రేపు దరఖాస్తులు పట్టుకుని మనం అమరావతి పోవాలా? హైదరాబాద్ పోవాలా? యాభై ఎనిమిదేళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే..ఈరోజున ఈ దుర్మార్గులు నిస్సిగ్గుగా, పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఒక్కసారి ఊహించండి.. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి.. చంద్రబాబు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిస్తే.. మనకు సాగర్ నీళ్లు రానిస్తాడా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా?’ అని ప్రశ్నించారు.