మోసాలకు పాల్పడుతున్న 78 భారతీయ కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం!
- నిషేధం విధించిన ప్రపంచ బ్యాంకు
- కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు
- 5 కంపెనీలపై ఆంక్షలతో కూడిన నిబంధనలు
ఏంజెలిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్లు నిషేధం విధించగా.. భారత్‌లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై రెండేళ్లు, ఆర్కేడీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. వీటితో పాటు తత్వ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మాక్లోడ్స్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌పై ఏడాది లోపు నిషేధం విధించారు.