నిన్న మాట్లాడినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. ఈ 12 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు: కేసీఆర్ పై కోమటిరెడ్డి సెటైర్లు
- కేసీఆర్ చేసేదంతా మోసమే
- జనాలు రారనే భయంతో చిన్న గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేస్తున్నారు
- టీఆర్ఎస్ కు ఘోర ఓటమి తప్పదు
కేసీఆర్ చేసేదంతా మోసమేనని విమర్శించారు. జనాలు రారనే భయంతోనే నల్గొండలో ఒక చిన్న గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారని... నల్గొండలో కూడా అదే మాదిరి మాట్లాడితే, జిల్లాలోని 12 స్థానాల్లోను టీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.