paritala sunitha: వైయస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. జగన్ సీఎం కాలేరు: పరిటాల సునీత
- జగన్ పాదయాత్రకే పరిమితమవుతారు
- ఎంతో మంది ఆడపడుచుల పసుపుకుంకుమలను వైయస్ తుడిచేశారు
- హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ ఎందుకు పూర్తి చేయలేదు?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకే పరిమితమవుతారని మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జగన్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. రాయలసీమ అభివృద్ధిపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రగతిపథంలో కొనసాగుతోందని తెలిపారు. రాజశేఖరరెడ్డి తన హయాంలో ఎంతో మంది ఆడపడుచుల పసుపుకుంకుమలు తుడిచేశారని... తాము చంద్రన్న పసుపుకుంకుమ పథకంతో మహిళలకు సాయం చేస్తున్నామని చెప్పారు.
వైయస్ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సునీత విమర్శించారు. దివంగత్ ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సీమ మొత్తం పచ్చటి పంటలతో కళకళలాడుతోందని అన్నారు.