Pridhvi Shah: అచ్చం సచినే... అరంగేట్రంలోనే అదరగొడుతూ హాఫ్ సెంచరీ చేసిన పృధ్వీ షా!

  • మైదానంలో మరో సచిన్ ను గుర్తు చేస్తున్న పృధ్వీ షా
  • ప్రశంసలు కురిపిస్తున్న సీనియర్లు
  • 56 బంతుల్లోనే 50 పరుగులు
ఆ కుర్రాడిని చూస్తుంటే సచినే గుర్తొస్తున్నాడు. ఎటువైపు షాట్లు కొట్టినా సచిన్ మైదానంలో నిలిచి కొడుతున్నట్టే ఉంది... నేడు తన తొలి టెస్టును ఆడుతున్న యువ క్రికెటర్ పృధ్వీ షా ఆటతీరును చూసిన సీనియర్లు చేస్తున్న కామెంట్లివి. తనపై ఉన్న అంచనాలను వమ్ము చేయని పృధ్వీ షా, అరంగేట్రంలోనే ఇరగదీశాడు.

తొలి ఓవర్లోనే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైనా, ఆ ప్రభావాన్ని తనపై పడ్డట్టు ఏ క్షణమూ కనిపించని పృధ్వీ, టెస్టు మ్యాచ్ ని వన్డేలా ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పృధ్వీకి మరో ఎండ్ లో ఉండి సహకారాన్ని అందిస్తున్న ఛటేశ్వర్ పుజారా, ప్రస్తుతం 38 పరుగులు చేశాడు. భారత స్కోరు ప్రస్తుతం 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు.
Pridhvi Shah
India
Westindees
Cricket
Rajkot
Debut

More Telugu News