గాంధీ జయంతి నాడు విడుదలైన 'మణికర్ణిక' టీజర్!
- కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో 'మణికర్ణిక'
- అలరిస్తున్న టీజర్
- చివరి షెడ్యూల్ కు కంగనా దర్శకత్వం
"ఇతిహాసాన్ని మార్చిన ఓ రాణి కథ. ఆమె ఇచ్చిన ఝలక్ చూడండి" అంటూ కంగనా, ఈ టీజర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. కొన్ని కారణాల వల్ల క్రిష్, ఈ సినిమా చివరి షెడ్యూల్ కు దర్శకత్వం వహించలేకపోవడంతో ఆ బాధ్యతను కంగనా తన భుజాలపై వేసుకుంది. కంగనా రనౌత్ తో పాటు జిషుసేన్ గుప్తా, సురేశ్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, డ్యానీ, అంకితా లోఖాండే తదితరులు నటించిన ఈ చిత్రం వచ్చే జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కానుంది. సినిమా టీజర్ ను మీరూ చూడండి.