Revanth Reddy: హైదరాబాదులోని ఆ ఇళ్లు నా కూతురివి!: రేవంత్ మామ పద్మనాభరెడ్డి

  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఇళ్లు రేవంత్ వి కావు
  • నా కూతురు గీతవి
  • ఐటీ అధికారులు నాకు నోటీసులిచ్చారు
టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మామ పద్మనాభరెడ్డి నివాసంపై గతంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గత నెల 28న ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు వివరణ ఇచ్చేందుకు ఆయన ఈరోజు వెళ్లారు. హైదరాబాద్, బషీర్ బాగ్ లోని ఐటీ శాఖ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం పద్మనాభరెడ్డి మీడియాతో మాట్లాడారు.

 హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో రేవంత్ కు ఉన్నాయని చెబుతున్న ఇళ్లు ఆయనవి కావని, తన కూతురు గీతవని స్పష్టం చేశారు. రేవంత్ తనకు అల్లుడు కాకముందే, తన కూతురు గీత ఆదాయపు పన్ను కడుతోందని చెప్పారు. ‘ఓటుకు నోటు’ కేసు అంశం వివరాలను తనను అడిగారని, తనకు తెలియదని చెప్పానని అన్నారు. రేవంత్ ఆస్తుల గురించీ తనను ప్రశ్నించారని, తగిన వివరణలు ఇచ్చానని అన్నారు. తాజాగా, మళ్లీ తనకు నోటీసులు ఇచ్చారని, ఈ నెల 20లోగా వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు కోరారని పద్మనాభరెడ్డి చెప్పారు. 
Revanth Reddy
Congress

More Telugu News