తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు: చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్
- నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలపై వార్తలు అవాస్తవం
- ఏదైనా రాసేటప్పుడు వివరణ తీసుకోవాలి
- మీడియాకు రజత్ కుమార్ సలహా
ఎన్నికల పోలింగ్ రోజున దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామని, ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయని అన్నారు. పోలింగ్ కేంద్రాలు కింది అంతస్తులోనే ఉండాలని సూచించామని, వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, వారికి కేంద్రానికి సమీపంలోనే పార్కింగ్ వసతిని కల్పిస్తామని అన్నారు.