ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో నిండా మునిగిన కంపెనీ.. రూ.9,200 కోట్లు హరీ!
- ఒక్క మెసేజ్‌తో ఘోరంగా దెబ్బతిన్న ఇన్ఫీబీమ్ షేర్లు
- ముప్పావు శాతం సంపద ఆవిరి
- కంపెనీ ఏజీఎం సమావేశానికి ఒక్క రోజు ముందే ఘటన
వాట్సాప్ మెసేజ్ కారణంగా కంపెనీ షేర్ శుక్రవారం ఏకంగా 70 శాతం క్షీణించింది. బీఎస్ఈలో గురువారం రూ.196 వద్ద ముగిసిన ఈ షేర్.. శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. అలాగే, ఇంట్రాడేలో 73 శాతం పతనంతో రూ.53.80ను తాకింది. బీఎస్‌ఈలో 1.9 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,200 కోట్లు కోల్పోయి రూ. 3,902 కోట్లకు పడిపోయింది.