దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలని ఆ దర్శకుడు వేధించాడు!: మరో బాంబు పేల్చిన తనుశ్రీ దత్తా
- షూటింగ్ లో అసభ్యంగా ప్రవర్తించాడని వ్యాఖ్య
- సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ అడ్డుకున్నారని వెల్లడి
- తనుశ్రీకి మద్దతు తెలుపుతున్న సెలబ్రిటీలు
‘చాకొలెట్: డీప్ డార్క్ సీక్రెట్స్’ సినిమా షూటింగ్ సందర్భంగా వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా చెప్పింది. సినిమా షూటింగ్ లో ఓ పాట సందర్భంగా దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అక్కడే ఉన్న సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ తనను రక్షించారని వెల్లడించింది. ఈ సందర్భంగా వివేక్ పై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. మరోవైపు బాలీవుడ్ లో లైంగిక వేధింపులను బయటపెట్టిన తనుశ్రీకి ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా, రిచా చద్దా, ట్వింకిల్ ఖన్నా మద్దతుగా నిలిచారు.