ఏపీ టీడీపీ ఆఫీసులో ఆవిష్కృతమైన కమనీయ దృశ్యమిది: నారా లోకేశ్

ఏపీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కృతమైన కమనీయ దృశ్యమంటూ మంత్రి నారా లోకేశ్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం, ఆకాశంలో చందమామ ఉన్నాయి. ‘నవ్యాంధ్రలో మళ్లీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం’ అంటూ ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేశ్ పేర్కొన్నారు.  


More Telugu News