KCR: ఎదుర్కొనే దమ్ము లేకనే... కేసులు పెట్టిస్తున్న కేసీఆర్: డీకే అరుణ నిప్పులు

  • కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు
  • రేవంత్ ఇంటికి వచ్చి మద్దతు తెలిపిన డీకే అరుణ
  • బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్య
టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనను, కేసీఆర్ అవినీతిని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై గత రెండు రోజులుగా జరుగుతున్న దాడులపై స్పందించారు. కాంగ్రెస్ నేతలను ఎదుర్కొనే దమ్ము లేకనే, కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం జూబ్లిహిల్స్‌ లోని రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన డీకే అరుణ, ఆయనకు మద్దతు పలికారు. తప్పుడు కేసులతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న టీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పేరోజు త్వరలోనే రానుందని ఆమె జోస్యం చెప్పారు.
KCR
DK Aruna
Revanth Reddy
Hyderabad
TRS

More Telugu News