doraswami raju: నాగార్జున - అమల పెళ్లి జరిపించింది నేనే!: నిర్మాత దొరస్వామి రాజు

  • నాగార్జునతో 'కిరాయిదాదా' చేశాను 
  • ఈ సినిమాతో 'అమల'ను పరిచయం చేశాను
  • అప్పుడే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు    
నిర్మాతగా ఆణిముత్యాల్లాంటి చిత్రాలను నిర్మించిన దొరస్వామిరాజు, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "అక్కినేని నాగేశ్వరరావుగారితో చేసిన 'సీతారామయ్య గారి మనవరాలు' సూపర్ హిట్ అయింది. ఇక నాగార్జునతో మొదటిసారిగా చేసిన 'కిరాయిదాదా సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది.

 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాతో ప్రధాన పాత్రగా 'మీనా'ను పరిచయం చేశాను. ఇక 'కిరాయిదాదా' సినిమాతో 'అమల'ను పరిచయం చేశాను. ఈ సినిమా సమయంలోనే నాగార్జున - అమల ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామంటే .. దగ్గరుండి తిరుపతిలో పెళ్లి జరిపించాను. వాళ్లంతా ఇప్పుడు చాలా హ్యాపీగా వున్నారు .. అందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.  
doraswami raju

More Telugu News