తన హాట్ ఫొటో విమర్శకులపై మండిపడ్డ సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన హాట్ ఫొటో విమర్శకులపై మండిపడ్డ సమంత!

  • భర్తతో కలసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత
  • పొట్టి దుస్తులతో ఉన్న ఫొటో షేర్
  • పెళ్లైన తర్వాత కూడా ఈ దుస్తులేంటని మండిపడ్డ నెటిజన్లు
సోషల్ మీడియాలో అక్కినేనివారి కోడలు సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో విషయాలను, తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా సమంత పంచుకుంటూ ఉంటుంది. తన భర్త నాగచైతన్యతో కలసి ప్రస్తుతం ఆమె స్పెయిన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఆమె అప్ లోడ్ చేసింది. పొట్టి డ్రస్సులో చాలా హాట్ గా ఉన్న ఓ ఫొటోను కూడా ఆమె పంచుకుంది.

అయితే, ఈ ఫొటోపై పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాంటి డ్రస్సులు ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి దుస్తుల్లో నిన్ను చూడలేకపోతున్నామని ...ఫొటోలను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. ఇంకోసారి ఇలాంటి ఫొటోను షేర్ చేయవద్దని కూడా చెప్పారు.

ఈ విమర్శలపై సమంత స్పందించింది. మధ్యవేలును అసభ్యంగా చూపిస్తూ ఘాటుగా రియాక్ట్ అయింది. పెళ్లి తర్వాత తాను ఎలా ఉండాలో తనకు చెబుతున్న వారందరికీ అంటూ కామెంట్ చేసింది.
samantha
naga chaitanya
tollywood

More Telugu News