TRS: రాజయ్యపై పోటీ చేస్తా.. చిత్తుచిత్తుగా ఓడిస్తా!: టీఆర్ఎస్ నేత రాజరపు ప్రతాప్

  • ప్రకటించిన టీఆర్ఎస్ నేత రాజరపు ప్రతాప్
  • తనను, అనుచరుల్ని తీవ్రంగా వేధించాడని మండిపాటు
  • స్టేషన్ ఘన్ పూర్ లో డిపాజిట్లు దక్కవని వ్యాఖ్య

తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు టీఆర్ఎస్ నేత రాజరపు ప్రతాప్ ప్రకటించారు. తాను సహకరిస్తున్నట్లు రాజయ్య ఓ సమావేశంలో చెప్పడం హ్యాస్యాస్పదమన్నారు. తనను నానా ఇబ్బందులకు గురిచేసిన రాజయ్య, తన అనుచరులపై పలు కేసులు పెట్టి వేధించాడనీ, అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వబోనని తేల్చిచెప్పారు.

ఎవరు ఏం చేసినా రాజయ్యను స్టేషన్ ఘన్ పూర్ లో చిత్తుచిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తానని రాజయ్య చెప్పుకుంటున్నాడనీ, కనీసం ఈసారి ఆయనకు డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా తాను పోటీ చేస్తాననీ, దమ్ముంటే రాజయ్య కూడా అలాగే పోటీ చేయాలని ప్రతాప్ సవాలు విసిరారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను టీఆర్ఎస్ అధిష్ఠానం తాటికొండ రాజయ్యకు కేటాయించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News