Andhra Pradesh: కేరళ వరద బాధితులకు రూ.2.91 కోట్లు విరాళంగా అందజేస్తాం: స్పీకర్ కోడెల

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగుల విరాళం
  • విరాళంగా నెల వేతనంతో పాటు ఇతర అలవెన్స్ లు
  • ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికసాయం అందించింది
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాల్ లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం తెలిపారు.

వరదలతో కేరళ అతలాకుతలమైందని, ప్రాణ, ఆస్తి నష్టం కలిగిందని, ఈ విషాదకర సమయంలో కేరళ వాసులకు అండగా ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికసాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఒక నెల వేతనంతో పాటు ఇతర అలెవెన్సులు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. శాసనసభ్యులు రూ.2,70,28,466, శాసన మండలి సభ్యులు 19,90,000, అసెంబ్లీ ఉద్యోగులు రూ.1,25,000 ... మొత్తం 2,91,43,466 విరాళంగా అందజేయనున్నారని కోడెల తెలిపారు.
Andhra Pradesh
kodela

More Telugu News