vijay: ఇకపై ఏ పెళ్లికీ నన్ను పిలవకండి ప్లీజ్!: తమిళ హీరో విజయ్

  • విజయ్ కి విపరీతమైన క్రేజ్ 
  • పెళ్లికి వెళితే ఎగబడిన జనం 
  • ఇకపై అలా జరగకూడదని నిర్ణయం      
తమిళనాట హీరో విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఫలానా చోట ఆయన షూటింగు జరుగుతోందంటేనే పెద్ద సంఖ్యలో అక్కడికి అభిమానులు వస్తుంటారు. అందువలన అలాంటి విషయాలు బయటికి రాకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు.

ఇక ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన ఒక పెళ్లికి ఆయన వెళ్లాడు. ఆ పెళ్లికి విజయ్ వస్తోన్న విషయం తెలిసి, వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో విజయ్ కి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లికి వచ్చిన బంధువులకి కూడా బాగా ఇబ్బంది అయింది. దాంతో ఇకపై తాను ఏ పెళ్లికీ వెళ్లకూడదని విజయ్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. తప్పదు అనుకుంటే తనే ఆ జంటను ఇంటికి ఆహ్వానించి గిఫ్ట్ ను అందజేయాలనీ .. ఫోటో సెషన్ జరపాలని .. ఆ దిశగా ఏర్పాట్లు చేయిస్తున్నాడట.    
vijay

More Telugu News