నిన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి... పిరికి కేసీఆర్!: ఉత్తమ్
- ఓడిపోతామన్న భయంతో దాడులు
- దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్న కేసీఆర్
- నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం
ఈ మేరకు ఆయన త్న ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "మొదట జగ్గారెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పిరికితనాన్ని ఇది స్పష్టంగా చూపిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ఏ నేతనూ ఎదుర్కొనే శక్తిలేని వారు, ఇలా దొంగదారిన దెబ్బతీయాలని చూస్తున్నారు. అతి త్వరలోనే తెలంగాణ నిరంకుశ పాలన నుంచి బయట పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఐకమత్యంగా ఉండి టీఆర్ఎస్ ను ఎదిరించి పోరాడతారు" అని ఆయన అన్నారు