రేవంత్ ఇంటి వద్దకు భారీగా అభిమానులు... ఉద్రిక్త వాతావరణం!
- ఉదయం నుంచి రేవంత్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు
- రాజకీయ కక్ష సాధింపేనంటున్న అభిమానులు
- బందోబస్తు కట్టుదిట్టం చేసిన పోలీసులు
సోదాల విషయం తమకు ముందుగా తెలియదని అంటున్న పోలీసులు, ఆయన ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయని సమాచారం.