రూ. 500 అప్పు తీర్చలేదని... స్నేహితుడి భార్యను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు!

  • కర్ణాటక, బెళగావి జిల్లాలో ఘటన
  • స్నేహితుడికి రూ. 500 అప్పిచ్చిన రమేశ్
  • డబ్బు ఇవ్వడంలేదని ఫ్రెండ్ భార్య కిడ్నాప్, వివాహం
  • అడిగితే దాడులు చేయిస్తున్నాడన్న బసవరాజు
తానిచ్చిన రూ. 500ను తిరిగి ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో తన స్నేహితుడి భార్యను తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక, బెళగావి జిల్లా, మిడకనట్టిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2011లో బసవరాజు, పార్వతిలకు వివాహం కాగా, వీరికి ఓ కుమార్తె ఉంది. వీరిద్దరూ ఓ హోటల్ లో పనిచేస్తుండగా, మురుకిబావి గ్రామానికి చెందిన రమేష్ హుక్కేరి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తనకు డబ్బు అవసరం కాగా, రమేశ్ వద్ద బసవరాజు రూ. 500 అప్పు తీసుకున్నాడు.

 ఈ అప్పు తిరిగి ఇవ్వడంలో బసవరాజు విఫలంకాగా, పలుమార్లు వాదనలు కూడా జరిగాయి. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, పార్వతిని ఎత్తుకెళ్లిన రమేశ్, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై అడిగితే, తనపై దాడులు చేస్తున్నాడని బసవరాజు ఆరోపిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, వారు కేసు నమోదు చేసుకోవడం లేదని ఆరోపించాడు. తన భార్యను కాపాడాలని బసవరాజు వేడుకున్నాడు.
Go Back to Shorts
Karnataka
Belagavi
Marriage
Friends
Loan

More Telugu News